Minister Dola: బుడమేరు మళ్లీ కొట్టుకు పోతుందని సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడలో వరద బాదితుల పరిస్దితులు మెరుగయ్యాయి.. ఓ ముఖ్యమంత్రిగా బాధితుల కోసం నాలుగు గంటలు జేసీబీ మీద ప్రయాణించిన చిత్తశుద్ది మా సీఎందే.. వైసీపీ అధినేత ఎక్కడికైనా వెళ్లి బాదితులకు సహాయం చేశారాని ఆయన పేర్కొన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సాయం చేశారో అందరూ చూశారు.. నోరుంది కదా అని మాట్లాడటం.. సొంత పేపర్లు, మీడియా ఉన్నాయి కదా అని ఏదంటే అది రాయటం సరికాదు.. రాష్ట్రాన్ని ఐదేళ్లు ఆడుకున్నారు.. గతంలో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే అరెస్టులు చేశారు అని మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు.
Read Also: Maharastra : ఆహారం, నీరు ఇవ్వకుండా ఐదు గంటలపాటు విమానంలోనే..రచ్చ రచ్చ చేసిన ప్రయాణికులు
ఇక, మీరు రెచ్చగొట్టి రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకీ మించి ముందుకు సాగలేరు అని మంత్రి డోలా అన్నారు. ప్రజలు అన్నీ గమనించే తీర్పు ఇచ్చారు.. సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ భాద్యతగా ఒక్కపని చేయలేదు.. చేసిన తప్పుల మీదే కొంత మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు.. చట్ట ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి.. అక్రమాలు ఎక్కడా జరగలేదు.. తప్పనిసరిగా అన్నీ మెడికల్ కళాశాలలు కొనసాగిస్తాం.. హడావుడిగా మసిబూసి మారేడు కాయ చేశారు అని పేర్కొన్నారు. మీరు చేసిన తప్పులు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు.