హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "తెలంగాణ సమాజం బాధ పడుతుంది. సీఎం కి కనీస మానవత్వం లేదు.. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారు. ఈ నెల గడవాలి అంటే హెచ్సీయూ భూములు అమ్మాలి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో హరిత విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. ముందు బీఆర్ఎస్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ చేస్తుందని పేర్కొన్నారు. "బీఆర్ఎస్ 25 లక్షల చెట్లు కాళేశ్వరం కోసం నరికేసి, హరితహారం పేరుతో కొనోకార్పస్ కల్లోలం తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కంచ, గచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రకృతి నాశనం చేస్తోంది. గొడ్డలి మారలేదు, పట్టిన…
హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మజ్లిస్ ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి వెనుకంజ వేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ కు అత్యధిక మంది కార్పొరేటర్లున్నా ఎందుకు పోటీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి సరిపడా బలం లేకపోయినా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని తెలిపారు. మజ్లిస్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండాలనుకుంటోందని అన్నారు. దమ్ముంటే…
కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను…
Local Body Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్లో కొత్తగా అత్యున్నత స్థాయి పోస్ట్ ఒకటి క్రియేట్ కాబోతోందా? పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్ళేందుకు వీలుగా ఆ పదవి రెడీ అవుతోందా? ముఖ్య నేత ఒకరు ఆ పార్టీ పదవీ బాధ్యతల కోసం ఉవ్విళ్ళూరుతున్నారా? దాని గురించి ఇప్పటికే కేసీఆర్ దగ్గర చర్చ జరిగిందా? అసలే పోస్ట్ గురించి ఈ చర్చ అంతా? ఎవరా నేత? తెలంగాణ పాలిటిక్స్లో ఇక దూకుడు పెంచాలని భావిస్తోందట బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినందున ప్రభుత్వ వైఫల్యాలపై…
Protest : హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ శ్రీశ్రీ విగ్రహం ముందు ట్రాన్స్జెండర్లు మరియు ట్రాఫిక్ అసిస్టెంట్లు కలిసి నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమను అవహేళన చేయడం అనైతికమని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “50 మంది ట్రాన్స్జెండర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాం” అని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేస్తుండగానే బీఆర్ఎస్కు చెందిన…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ట్విట్టర్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుంది. కంచే-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను,” అని కేటీఆర్…
Boianapalli Vinod Kumar: హనుమకొండలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభ కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా మారుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా…
ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న వారు.. ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారు .. ఎమ్మెల్సీగా రిటైర్ అయిన వారికి విరామం మాత్రమే కానీ విశ్రాంతి కాదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చింది.