Harish Rao: సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ అని ఫైర్ అయ్యారు. ఇక, రైతు బంధు, రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవి అన్ని అబద్ధాలే.. అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలకు రుణమాఫీపై సవాల్ విసిరితే ఉలుకులేదు, పలుకు లేదు అని హరీష్ రావు అన్నారు.
Read Also: AP High Court: హైకోర్టులో ఐపీఎస్ అధికారి జాషువాకి షాక్..
ఇక, కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దేశ సగటులో జీఎస్టీ తగ్గిందంటే దానికి కారణం రేవంత్ రెడ్డే.. కేసీఆర్ చెట్లు పెడితే…రేవంత్ రెడ్డి నరుకుతా అంటాడు.. ఇక, హైడ్రాతో పేదల ఇల్లు కూల్చాడు.. కేసీఆర్ ది సాగు బాషా అయితే రేవంత్ రెడ్డిది చావు బాషా అని మండిపడ్డాడు. రేవంత్ రెడ్డి పని ఢిల్లీలో కూడా అయిపోయింది.. బీసీల ధర్నాకు ఢిల్లీలోనే ఉన్న రాహుల్ గాంధీ ధర్నాకు రాలేదు.. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పాడు. HCU విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. HCUలో అడవులు నరికిన రేవంత్ రెడ్డికి మూగ జీవాల ఉసురు తగులుతుంది అని హరీష్ రావు శాపనార్థాలు పెట్టాడు.
Read Also: Vangalapudi Anitha: జగన్ టూర్ డ్రామాను తలపించింది.. వాట్సాప్‌లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు..!
అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మంత్రులు కూడా వినడం లేదు అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ పాలన అంతా సగం సగం.. ఆగం ఆగం ఉందన్నారు. దేవుడినే మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణ రేవంత్ రెడ్డి చేతికి ఇస్తే అంత ఆగం చేస్తున్నాడు.. ఏడాదిలోనే లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పు చేశాడు.. రేవంత్ రెడ్డి వచ్చాక కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లకు రంగులు మాత్రం వేస్తున్నారు.. 10 ఏళ్లు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది.. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇవ్వాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.