MLA Medipally Sathyam: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న తెలంగాణ ప్రజలు రెండు అపురూప దృశ్యాలు చూశారని వ్యాఖ్యానించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నులపండువగా అత్యంత వైభవంగా జరిగిందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారని తెలిపారు. గత పదేళ్లుగా ఈ దృశ్యం కోసం తెలంగాణ ప్రజలు, రామభక్తులు ఎదురు చూస్తున్నాట్లు ఆయన పేర్కొన్నారు.…
krishank Manne: హైదరాబాద్ కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని భూ వివాదంతో పాటు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అంశంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై AI ఆధారంగా తప్పుడు పోస్టులు చేశారనే అభియోగంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 9, 10, 11 తేదీలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరుకావాలని…
Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో, ట్విటర్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు పేర్కొన్న వివరాల ప్రకారం, బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62 శాతం…
Murder : ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి స్వప్నం సింగ్ (59) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల నాలుగో తేదీన అల్వాల్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పిఎస్ లో 0 ఎఫైర్ నమోదు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అల్వాల్ లో నివాసం ఉండే స్వప్నం సింగ్ తన సోదరుడు హరిదీప్ సింగ్ ను ముషీరాబాద్…
Jagadish Reddy: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) తరలింపు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన అనాలోచితమైనది అని వ్యాఖ్యానించారు. HCUని తరలించడం అనేది ప్రభుత్వానికి సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టే నిర్ణయమని ఆయన తెలిపారు. HCUని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చేస్తే మంచిది అని చెప్పారు. గతంలో HCUని తరలించాలని అనుకున్న ముఖ్యమంత్రి లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు…
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. అయితే అనేకమంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని చెప్పారు. జాతీయ భావజాలం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ…
KCR : తెలంగాణ కోసం దశాబ్దాల ఉద్యమానికి నాంది పలికిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల సంక్షేమం పట్ల ఉన్న ఆవేదన, కర్తవ్యనిష్ఠ ఇతర పార్టీలకు దూరమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఉద్యమ స్థాయిలో ప్రజల కోసం అహర్నిశలు కృషి చేయగల శక్తి బీఆర్ఎస్దే అని స్పష్టం చేస్తూ, “తెలంగాణ సాధన అనంతరం తొమ్మిదిన్నరేళ్ళ పాటు ప్రజాకాంక్షలకు అనుగుణంగా పాలించగలిగింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే” అని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం ఎర్రవెల్లి నివాసంలో…
KTR : ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది. ఎన్నికల్లో గెలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీ హామీల మీద హామీలు గుప్పిస్తుంది. అధికారంలోకి వస్తే తాము ఇది చేస్తాం అది చేస్తామంటూ చెబుతోంది. ఇలా హామీలు ఇవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా లేదా క్యాడర్లో కాన్ఫిడెన్స్ కోసమే ఈ హామీలు ఇస్తున్నారా…? పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జనాల…
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…