Manne Krishank : హైకోర్టు నుండి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించిన నకిలీ వీడియోల ప్రచారంపై తనను అన్యాయంగా ఆరోపిస్తూ ఈ కేసులు పెట్టారని, తాను ఎలాంటి ఫేక్ వీడియోలను పంచలేదని పిటిషన్‌లో క్రిశాంక్ పేర్కొన్నారు.
అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలో భాగంగా, ఏఐ సాంకేతికతను ఉపయోగించి క్రిశాంక్ ఫేక్ వీడియోలు రూపొందించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని, ముఖ్యమంత్రి పైన అనుచిత పోస్టులు కూడా పెట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, క్రిశాంక్ విచారణకు హాజరుకావాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఇదే కేసులో మరో వ్యక్తి అయిన కొణతం దిలీప్‌కు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించిన న్యాయస్థానం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Congress: ముగిసిన సీడబ్ల్యూసీ మీటింగ్, కాంగ్రెస్ 7 తీర్మానాలు.. అవి ఏంటంటే..