Minister Thummala: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడే లక్ష రూపాయల రుణమాఫీని కూడా ఒకే దఫాలో చెయ్యాలని ఆలోచన చెయ్యని వారు.. రెండో సారీ అధికారంలోకి వచ్చాక కూడా రుణ మాఫీకే రైతులను గోస పెట్టి ఎన్నికల వస్తున్నాయి.
మీరు పదేండ్లు అధికారంలో ఉన్నారు.. ఇప్పుడు మేం పదేండ్లు అధికారంలో ఉంటాం.. ప్రజల జీవితాలను బాగు చేస్తామన్నారు. మూడేండ్లు ప్రజల కోసం కలిసి పని చేద్దాం.. ఎన్నికల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు వచ్చి సలహాలిచ్చిన స్వీకరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడమంటే బీఆర్ఎస్కు మంచి నీళ్ళ ప్రాయం. ఒకప్పుడు అలా పిలుపునిస్తే… ఇలా సక్సెస్ అయిపోయేవి సభలు. కానీ… ఇప్పుడు.. రజతోత్సవ సభ కోసం స్థల ఎంపికలోనే ఆపసోపాలు పడుతోందట. చివరికి సెంటిమెంట్గా ఉన్న వరంగల్ విషయంలోనే పునరాలోచనలో పడిందా? సభ ఎక్కడ పెట్టాలో తేల్చుకోలేకపోతోందా? ఎందుకు పునరాలోచనలో పడింది గులాబీ పార్టీ? సభా ప్రాంగణం విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీఆర్ఎస్ ఆవిర్భవించి వచ్చేనెల 27కు పాతికేళ్ళు పూర్తవుతుంది. సిల్వర్ జూబ్లీ…
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7 శాతం పెరిగిందని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్…
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది.…
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?” అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆశా వర్కర్లకు…
Sabitha Indra Reddy: మేడ్చల్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్న ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు.
Minister Komatireddy: నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.. పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ లు కోల్పోయారు అని మండిపడ్డారు.
Local Body MLC Election: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది.