Jagadish Reddy: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా- గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నారని తెలిపారు. కానీ, ఇపుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుని పోతున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిపోయింది.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదు అని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.. కేసీఆర్ సీఎంగ ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..
ఇక, సీఆర్పీఎఫ్కు సాగర్ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమే అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతోంది.. చంద్రబాబు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదు అన్నారు. వయా చంద్రబాబు ద్వారా ఈ ప్రభుత్వం మోడీకి దగ్గరైంది అన్నారు. లక్ష మందితో కేసీఆర్ సభ పెట్టబోయే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచి కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేసింది అన్నారు. ఇక, మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పదవికి ముప్పు ఉంటుందనే రేవంత్ రెడ్డే దాన్ని ఆపుతున్నారు.. ఎలాగూ కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదని ఆ పార్టీ వాళ్ళే చెబుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.