ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. “మీరు పడగొట్టిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టిండు.. తెలంగాణలో మీకుటుంబమే నిలబడింది.. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదు.. మామకు వారసుడు అని పగటి కలలు కంటుండు.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పోస్టర్లలో హరీష్ రావు ఫొటో లేదు.. 2009 లోనే హరీష్ రావు కన్న కల చెదిరిపోయింది..
Also Read:PM Modi: రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
బామ్మర్ది కేటిఆర్ వచ్చాక హరీష్ రావు పరిస్థితి పార్టీలో అగమ్యగోచరంగా తయారైంది.. రాష్ట్రంలో బూతు పితమహులు కేసీఆర్.. కళ్ళు ఉండి చూడలేని, చెవులు ఉండి కూడా వినలేని కబోది హరీష్ రావు.. కాంగ్రెస్ లో బీసీ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు.. బీఆర్ఎస్ లో బీసీని ప్రెసిడెంట్ గా గాని కనీసం వర్కింగ్ పోస్ట్ అయినా ఇవ్వగలరా? బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగానైనా బీసీని పార్టీ అధ్యక్షుడుని చేయాలి అని” సవాల్ విసిరారు.