HCU Lands Issue: హైదరాబాద్ నగరంలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. ఈసందర్భంగా హెచ్సీయూ భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్ట్ చెయ్యడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Read Also: Vangalapudi Anitha: జగన్ టూర్ డ్రామాను తలపించింది.. వాట్సాప్‌లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు..!
అయితే, హెచ్సీయూ భూముల వివాదంపై అటవీ శాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యూఐ నేతలు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, మూడు రోజుల విచారణలో భాగంగా మొదటి రోజు విచారణకు బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ వెళ్లారు. ఈ విచారణలో భూముల వివాదంపై సుధీర్ఘంగా విచారణ జరపనున్నారు.