MLC Kavitha : దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష ఉంది
- బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది
- రామమందిరం ఘటనపై కుల వివక్షపై ఆగ్రహం
- 50% మించి రిజర్వేషన్లు కల్పించాలన్న కవిత డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : బీసీల హక్కుల కోసం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె తీవ్రంగా ఎండగట్టారు. “ఇది ప్రజాస్వామ్య దేశమా?” అనే ప్రశ్నతో ఆమె వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి.
కవిత వివరించిన దయనీయ సంఘటనలో, శ్రీరామనవమి సందర్భంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారాం జుల్లి రామాలయాన్ని దర్శించుకెళ్తే, ఆలయం మైలపడిందని అభిప్రాయపడుతూ సంప్రోక్షణ చేపట్టిన దళిత వ్యతిరేక వర్గాల చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. “ఇలాంటి దౌర్భాగ్యమైన ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే, ప్రజాస్వామ్యం, సమానత్వం, సోదరభావం అన్నది కేవలం మాటలకే పరిమితమవుతోంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి దేశపు గౌరవనీయ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. “రాష్ట్రపతి గిరిజన మహిళ అయితే ఏమి? ఆమెను ఆహ్వానించకపోవడం బీజేపీ ప్రభుత్వం ఎస్టీ సామాజిక వర్గం పట్ల తీసుకున్న దారుణ వైఖరి” అని పేర్కొన్నారు.
బీసీలకు కూడా ఈ దేశంలో ఇప్పటికీ అనేక అవమానాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. “ధర్నాలు ఎందుకు చేస్తున్నాం?” అని కొంతమంది అడుగుతున్నారని, “బీసీ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నా ఆవేశం, ఆవేదన ఇవి. రాజకీయ అవసరం కాదు, ఇది హక్కుల పోరాటం,” అని స్పష్టం చేశారు. ఈబ్ల్యూఎస్ అమలుతో 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తేసిన నేపథ్యంలో, కోర్టులు రిజర్వేషన్‌ను అడ్డుకునే అవకాశమే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. “బీసీలకు అర్హతకు తగ్గ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇది సరైన సమయం” అని పేర్కొన్నారు.
YSRCP: వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం..! హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు..
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!