ప్లీనరీ సక్సెస్ కోసం గులాబీ అధిష్టానం స్పెషల్ స్కెచ్ వేసిందా? పైకి ఎన్ని గొప్పలు చెబుతున్నా…. జన సమీకరణ విషయంలో డౌట్స్ ఉన్నాయా? అందుకే పార్టీ నాయకులకు బంపరాఫర్ ప్రకటించేసిందా? చెప్పాల్సింది చెప్పేసి… ఇక మీ ఇష్టం…. మీ సత్తా…. నిరూపించుకోండని వదిలేసిందా? వరంగల్ గ్రౌండ్ నింపేందుకు బీఆర్ఎస్ పెద్దలు పెట్టిన స్కీమ్ ఏంటి? టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది? అధికారంలో లేకున్నా డోంట్ మైండ్… పార్టీ రజతోత్సవ వేడుకల్ని మాత్రం గ్రాండ్గా నిర్వహించాలని…
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. “మీరు పడగొట్టిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టిండు.. తెలంగాణలో మీకుటుంబమే నిలబడింది.. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదు.. మామకు వారసుడు అని పగటి కలలు కంటుండు.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పోస్టర్లలో హరీష్ రావు ఫొటో లేదు.. 2009 లోనే హరీష్ రావు కన్న కల…
ఆ నియోజకవర్గంలో కారు వోవర్ లోడ్ అయిందా? పేరుకు అంతా లీడర్సేగానీ….స్టీరింగ్ పట్టుకునే వాళ్ళు కరవయ్యారా? అసలు డ్రైవర్ సీటే ఖాళీ లేనంతగా పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? చివరికి వర్గపోరు ఆ మాజీ ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా ఈక్వేషన్స్? నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కారు ఓవర్ లోడ్ అయ్యిందట. స్టీరింగ్ మాక్కావాలంటే… మాక్కావాలంటూ పలువురు నేతలు చూపుతున్న ఉత్సాహమే ఇందుకు కారణమంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక్కడ కేడర్కంటే లీడర్స్…
నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.. కేసీఆర్ సీఎంగ ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
HCU Lands Issue: హైదరాబాద్ నగరంలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. ఈసందర్భంగా హెచ్సీయూ భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్ట్ చెయ్యడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
Manne Krishank : హైకోర్టు నుండి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించిన నకిలీ వీడియోల ప్రచారంపై తనను అన్యాయంగా ఆరోపిస్తూ ఈ కేసులు పెట్టారని, తాను ఎలాంటి ఫేక్ వీడియోలను పంచలేదని పిటిషన్లో క్రిశాంక్ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలో భాగంగా,…
MLC Kavitha : బీసీల హక్కుల కోసం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె తీవ్రంగా ఎండగట్టారు. “ఇది ప్రజాస్వామ్య దేశమా?” అనే ప్రశ్నతో ఆమె వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి. కవిత వివరించిన దయనీయ సంఘటనలో, శ్రీరామనవమి సందర్భంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారాం జుల్లి రామాలయాన్ని దర్శించుకెళ్తే, ఆలయం మైలపడిందని అభిప్రాయపడుతూ సంప్రోక్షణ…
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (AI) ప్రమాదకరమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆమె దానిపై కౌంటర్ ఇచ్చారు. “AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… అనుముల ఇంటెలిజెన్స్!” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవిత, ఈ ‘అనుముల ఇంటెలిజెన్స్’ వల్లే రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. అనుముల…
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఏర్పాట్లు శవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విషయాలు పంచుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘వరంగల్ ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో చాలా గ్రాండ్ గా సభ ఏర్పాటు చేస్తున్నాం.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్.. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ళ ప్రస్థానం చేసుకుంది టీడీపీ, బీఆర్ఎస్ లే.. అనుమతి కోసం మార్చ్ 25 న పోలీసులకు రిక్వెస్ట్ చేశాము.. తొందరగా అనుమతి…