Former MLA Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మోకిలలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి విచారణకు హాజరు అయ్యారు.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో తపమంటున్నాయని మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వంపై అవరోధాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఆ ఘటన వెనుక బీఆర్ఎస్ నేతలే ఉన్నారని,…
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మధ్య కేంద్ర నిధులపై ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని, బీబీ నగర్ ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తరచూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం గత…
సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో డీ లిమిటేషన్పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్నారు. "జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలి. వాజ్ పేయి కూడా పునర్విభన 25 ఏళ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర…
బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యిందన్నారు. నేడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేల తో స్క్రిప్ట్ రాసి చదివి వినిపిస్తున్నారని ఆరోపించారు.
Jagadish Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ఒక్క ఏడాది పాలనలోనే తెలంగాణ అభివృద్ధిని నిలిచిపోయిందని, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. అయితే, మంత్రుల ఆదాయాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతల పని దోచుకోవడం, దాచుకోవడమేనని ఆయన మండిపడ్డారు. రైతులకు మద్దతు ఇవ్వాల్సిన మంత్రులు హెలికాప్టర్లలో షికార్లు చేస్తుంటే, ఎండిన పంటలను పరిశీలించేందుకు మాత్రం సమయం లేదని…
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటే గౌరవం ఉంది.. కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు దొంగ సీఎం అని అనలేదు.. జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు 30 శాతం అని.. అలాగే, పీసీసీ పదవిని 50 కోట్ల రూపాయలకు కొన్నాడు అని కోమటిరెడ్డి అన్నారు.. ఇవన్నీ నేను అన్న మాటలు కావు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలే చెప్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రులు ఎందుకు ఎగ్జైట్ అవుతారు.. మంత్రులకు సంయమనం ఉండాలి అన్నారు. మేము అడుగుతాం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని అంటాం.. ఇక, 30 శాతం కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. నీలాగా విలువలు లేని రాజకీయాలు చేయడం లేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. దోచుకున్న ది నువ్వు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం…
Minister Ponguleti: తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పై ప్రజలు తీర్పు ఇచ్చారు.. మా సభ్యులే కాదు.. మీ వైపు ఉన్న సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.
BRS MLCs Protest: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేసింది. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తుంది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా కారు పార్టీ ఎమ్మెల్సీల నిరసన చేశారు.