Deputy CM Bhatti: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టకుండా ఎలా ఇస్తున్నారు.. ఉన్నవన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనివే అని చెప్పాను.. భద్రాద్రి, యాదాద్రి నుంచి కరెంటు ఉత్పత్తి కాలేదని చెప్తే కేసీఆర్ నుంచి సమాధానం లేదు.. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు సాగుతున్నాం.. 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా కోతలు లేకుండా ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ పాలన.. 2050 నాటికి గాలి, సోలార్, నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 20 వేల మెగావాట్ల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. 29 లక్షల పంపు సెట్లకు ఇచ్చే కరెంట్ కు రూ.12,500 కోట్లు రైతుల పక్షాన కడుతున్నాం.. మహిళల అభివృద్దే, రాష్ట్ర అభివృద్ధి అని ముందుకు సాగుతున్నాం.. మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు.
Read Also: Bandla Ganesh: దిల్ రాజు ప్రెస్ మీట్ సమయంలో బండ్ల గణేష్ సంచలన ట్వీట్
ఇక, 22 వేల కోట్ల రూపాయలతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లలో గిరిజనుల గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. సాగు చేసుకుంటుంటే ఆడవాళ్ళు అని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారు.. మా ప్రభుత్వంలో ఇందిరా సౌరగిరి జలవికాస పథకం అమలు చేస్తున్నాం.. అడవీని రక్షిస్తూనే.. అడవి బిడ్డల ఆత్మగౌరంగా బతికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.. గత ప్రభుత్వ హయంలో పెండింగ్ లో ఉంచిన రూ. 8వేల కోట్ల బకాయిలు తీర్చాం.. దెయ్యాలకు నాయకత్వం వహించిన వాళ్ళు దేవుడెలా అవుతారు? అని అడిగారు. ప్రజలను వేధించే దెయ్యాలను తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచేస్తామన్నారు. ప్రజల పక్షమే, మా పాలన లక్ష్యం.. పాలమూరు జిల్లాలో కట్టిన ప్రతి ప్రాజెక్ట్ కాంగ్రెస్ కట్టిందే.. పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.. ప్రాధాన్యతగా ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తాం.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును నిత్యం పర్యవేక్షిస్తూ.. అవసరమైన చోట భూసేకరణకు నిధులు విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.