KCR: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది.
Read Also: Supreme Court: హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
అయితే, కాళేశ్వరం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5వ తేదీన కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కాగా, గులాబీ బాస్ కి కాళేశ్వరం మిషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ నుంచి పార్టీలో కమిషన్ ముందు హాజరు కావాలా లేదా అని అంశంపై తర్జనభర్జన జరిగింది.. కానీ, చివరకు వచ్చే నెల 5న విచారణకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మరోవైపు, జూన్ 6న ఈటెల రాజేందర్, చివరగా జూన్ 9వ తేదీన హరీష్ రావు హాజరవ్వాలని నోటీసుల్లో పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నారు.