Errabelli Dayakar clarity on his words: నా మాటలను వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. మహబూబాబాదు జిల్లా నరసింహులపేట మండలం వేదికలో నేను అలా చెప్పలేదని అన్నారు. ఆవార్తలపై స్పందించిన మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 80 సీట్లు తప్పకుండా బీఆర్ ఎస్ గెలుస్తుందని చెప్పానని స్పష్టం చేశారు. మరో 20 సీట్ల కోసం గట్టిగా పనిచేయాలని నేను చెప్పినానని మంత్రి తెలిపారు. అయితే నేను చెప్పంది వేరైతే దానిని వక్రీకరించారని మండి పడ్డారు మంత్రి.
Read also: Revanth Reddy: నిజాం రాజు అంతక్రియలను తప్పుపట్టే వారు మానసిక అంగవైకల్యం కలవారు
BRS పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు పక్క అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ విషయంపై క్యాబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు మహబూబాబాదు జిల్లా నరసింహులపేట మండలం వేదిక అయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని, కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందని సభా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. ప్రజలలో వ్యతిరేకత ఉన్న 20 మంది ఎమ్మెల్యేలను మార్చాలని అన్నారు. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Uppal Stadium: ఉప్పల్ స్డేడియంకు వెళ్తున్నారా? అయితే ఇవి తప్పనిసరి