బీజేపీ వ్యతిరేక కూటములకు మద్దతిస్తాం సభలో రాజకీయాలు కూడా చర్చకు వస్తాయన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. ఖమ్మంలో జరగనున్న సభకు రాజకీయపరంగా ప్రత్యేకత సంతరించుకుందని తమ్మినేని వీరభద్రం అంటున్నారు. దేశ వ్యాప్తంగా నలుగురు ముఖ్యమంత్రులు హాజరవుతున్న ఈ సభలో వామపక్ష పార్టీల నుంచి తాము కూడా పాల్గొంటున్నామని యీ సభ దేశ రాజకీయాలను అద్దం పడుతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో ప్రస్తుతం నేలకొని ఉన్న రాజకీయాలు బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక ఐక్య కార్యాచరణ సమితికి ఈ సభ ఉపయోగ పడుతుందని అంటున్నారు తమ్మినేని వీరభద్రం. ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఏమాత్రం అవకాశం లేని విధంగా తాము కృషి చేస్తామని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.
Also Read : Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దుపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేకు మెసేజ్ లు పంపిన రైతులు
ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. టీఆర్ఎస్ కాస్తా… జాతీయ పార్టీగా అవతరించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) ఢిల్లీలో ఏర్పాటైనా.. ఆవిర్భావ సభ ఇంతవరకూ జరగలేదు. దానికి ఇవాళ ఖమ్మంలో ముహూర్తం. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ చాలా వ్యూహాలు రచిస్తోంది. ఇక, ఈ సభకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు హాజరుకానున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్‌టి బీఆర్‌ఎస్ సభవైపు మళ్లింది.. కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రాష్ట్ర ప్రజలతో పాటు.. జాతీయ నేతలు కూడా కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా చూస్తున్నారు..
Also Read : Alert : పిల్లల్లో నిద్రలేమితో మెదడు సమస్యలు