ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.
2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎం కు లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండించారు.