తనకు సెక్యూరిటీ అవసరం లేదని తను ఉగ్రవాదిని కాదు కబ్జాలు చేయలేదని మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంగిరెద్దుల అడించే వారిలా సంక్రాంతి కి రాలేదని అన్నారు.
తక్షణమే పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సూచిస్తోందన్నారు.
కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారని బీజేపీ నేత NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ పెట్టిందే హరీష్ రావును డిల్లీ కు పంపించడానికే అంటూ ఆరోపించారు. అవినీతి కు మారు పేరు brs అంటూ నిప్పులు చెరిగారు. కమ్యూనిస్ట్ ల కోరిక మేరకే ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారంటే ఎద్దేవ చేశారు.
Koppula Eshwar : తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వి.సులం తుంగ్ హెచ్ లోథా భేటీ అయ్యారు.
6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు.