Bandi Sanjay: పుట్టినరోజు నాడు సెక్రటేరియట్ ప్రారంభించడం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా దేశ నాయకుడా ఆయన పుట్టినరోజు నాడు సెకటేరియట్ ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ జయంతి నాడు సెకటేరియట్ ను ఎందుకు ప్రారంభించరు? కేసీఆర్ ఉన్న ఇబ్బంది ఏంటి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సమావేశానికి వచ్చిన వారు నలుగురు నాలుగు స్కామ్ లో ఉన్నారని, వచ్చిన ముఖ్యమంత్రుల్లో ఒకరు లిక్కర్, ఒకరు మైనింగ్ ఒక గోల్డ్ స్కాం లో ఉన్నారని ఆరోపించారు బండి సంజయ్. కేటీఆర్ దావోస్ కి సినిమా షూటింగ్ కొరకు వెళ్తారని ఎద్దేవ చేశారు. ఈ కమిషన్ తట్టుకోలేక 25 వేల కోట్ల ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ తరలిపోయిందని ఆరోపించారు. క్రిమినల్, మతత్వ పార్టీ అయిన ఎంఐఎంతో కలిసి బీ.ఆర్ ఎస్ తిరుగుతుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జోకర్ మాటలు మాట్లాడుతున్నారని,. ఖమ్మం సభకు 10.లక్షలు ఇస్తామని అన్నారు.. ఆయన కూడా ఎవరు రాలేదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతుంటే అందరూ వెళ్లిపోయారని ఎద్దేవ చేశారు. సర్పంచుల కొరకు కేంద్రం కేటాయించిన నిధులను ఎత్తుకెళ్లిన దొంగ కేసీఆర్ అని ఆరోపించారు.
Read also: BJP Resolution: ప్రధాని ఆధ్వర్యంలో ప్రపంచ భవిష్యత్‌కు రక్షకుడిగా భారత్.. బీజేపీ తీర్మానం
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
కేసీఆర్ దొంగల ముఠా నాయకుడు, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ బండి సంజయ్ మాటలు దుమారంగా మారాయి. ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు. బెదిరించి సభను సక్సెస్ చెయ్యాలని చూసారని ఆరోపించారు. కర్నాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీశ్ కూడా రాలేదని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. పాకిస్థాన్ గురించి మాట్లాడితే అక్కడ తిండి గురించి కొట్లాడుకుంటున్నారని అన్నారు. దయచేసి భారత దేశం బాగుందని కేసీఆర్ నోటి వెంట ఆ మాట రావద్దని కోరుకుంటున్నానని మీడియా ముఖంగా కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో 21 డ్యాంల నిర్మాణాలను 8 సంవత్సరాల నుండి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు.
Read also: Assistant Loco Pilot: లోకో పైలెట్ మిస్సింగ్ మిస్టరీ.. యాభై రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ
తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదని ఎద్దేవ చేశారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డిస్క్ంలకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నారని.. ముందు వాళ్లకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించారు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ ఒక జోకర్, ఆయన జోకర్ మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. నిన్న ఖమ్మం సభలో ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందే! కొత్తగా ఏం మాట్లాడలేదని అన్నారు. వందేభారత్ ట్రైన్ లు దేశీయంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారయ్యాయని అన్నారు. కేసీఆర్ వేషం, భాష తుపాకి రాముడు మాటలే! అని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ తో కేసీఆర్ జతకట్టాడని అన్నారు. దళితులను వంచించిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
Read also: Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కాలనీకే కంటి వెలుగు..
దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చిన ఘనత బీజేపీదే అని అన్నారు బండి సంజయ్. దళితులకు కేసీఆర్ ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని మాట్లాడలేదని గుర్తుచేశారు. తెలంగాణను మరచి పోయిన కేసీఆర్ తో జై తెలంగాణ అనిపిస్తామన్నారు. ఒక విషయంలో కేసీఆర్, పంజాబ్ సీఎంలు ఒకటే అని అన్నారు. ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో ఉన్నారని ఆరోపించారు. ఒక్క నేత బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదని వ్యంగాస్త్రం వేశారు. దేశంలో వచ్చేది ఆప్ ప్రభుత్వం అని కేజ్రీవాల్ ప్రకటించాడని, మరి బీఆర్ఎస్ సంగతి ఏమిటి? అని బండి సంజయ్ నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CI Muthu Yadav: లోకో పైలెట్ మిస్సింగ్.. అందువల్లే ఆచూకీ తెలియలేదన్న సీఐ
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?