బండి సంజయ్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఖమ్మం సభను చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
కేసీఆర్ ఏమైనా దేశ నాయకుడా ఆయన పుట్టినరోజు నాడు సెకటేరియట్ ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ జయంతి నాడు సెకటేరియట్ ను ఎందుకు ప్రారంభించరు? కేసీఆర్ ఉన్న ఇబ్బంది ఏంటి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. నిన్న బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణకు ప్రభుత్వం వెలుగుల యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని ప్రజలందరికీ గురువారం నుంచి కంటి పరీక్షలు చేయనున్నారు. తెలంగాణలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా అంధత్వ నివారణకు ఉచిత కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ రంగులోకి మారింది. అయితే సీఎం కేసీఆర్తోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల బీఆర్ఎస్ జెండాలు, హోర్డింగ్లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి.
Kanti velugu second phase: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు.
బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది నిజాం వల్లనే అని స్పష్టం చేశారు.
నా మాటలను వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. మహబూబాబాదు జిల్లా నరసింహులపేట మండలం వేదికలో నేను అలా చెప్పలేదని అన్నారు. ఆవార్తలపై స్పందించిన మంత్రి క్లారిటీ ఇచ్చారు.