Minister KTR : బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్.. మసీదులు కాదు.. దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ 14 నెలల్లో కేంద్రం నుంచి ఈటల ఒక్క రూపాయి అయినా తెచ్చారా?అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌కు రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆరే అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సభ చూస్తే హుజురాబాద్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్న నమ్మకం కలుగుతోందని, 14నెలల కింద జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల మాటలు నమ్మి గెలిపించారన్నారు. 14 నెలల్లో ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా ఢిల్లీ నుంచి వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు వారివి అని ఆయన మండిపడ్డారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తికి ఎంతో మందిని కాదని టిక్కెట్ విషయం మార్చిపోయిండా.. అలాంటి తండ్రి నాయకున్ని పట్టుకుని కేసీఆర్ పాలన అరిష్టమని ఈటల అంటున్నడు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పాలన అరిష్ఠమో అందరికీ తెలుసునని, జనధన్ ఖాతాలా ధనాధన్ 15 లక్షలన్నడు.అవన్నీ ఒకే ఒక్కరి ఖాతాలో పడటంతో ప్రపంచ ధనవంతుడయ్యాడని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Air India Urination Case: కో పాసింజర్‌పై మూత్ర విసర్జన కేసులో శంకర్ మిశ్రాకు బెయిల్
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
మోడీ దేవుడట.. ఎవనికి దేవుడు? 400 సిలిండర్ 12వందలు చేసినందుకు, 2 కోట్ల ఉద్యోగాలని మోసం చేసినందుకు దేవుడా? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదలను గొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం మోడీదని ఆయన ఆరోపించారు. పెట్రోలు డీజిల్ పై 30లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజేందరన్న నీకు నియ్యతుంటే… మోడీ 100 లక్షల కోట్లు అప్పు చేసింది నిజం కాదా? అని కేటీఆర్ అన్నారు. జాతీయ రహదారులంటున్న బండి సంజయ్… వాటిపై మళ్లీ టోల్ వసూలు చేస్తున్నారు? అని, ఎయిర్ పోర్టులకు పర్మిషన్ ఇవ్వడం తప్ప కేంద్రం చేసిందేమీ లేదని ఆయన అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు తొక్కిపెట్టారని, గిరిజన యూనివర్శిటీ ఇవ్వలేదని, ఎప్పుడూ లేనంతగా ధరలు, ద్రవ్యోల్బనం పెరిగిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అమిత్ షాను టచ్ చేయాలని బండి సంజయ్ కు అనిపిస్తోందట. ఇదేం దిక్కుమాలిన కోరిక అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. మసీదులు కాదు తవ్వడం.. అభివృద్ధికోసం పునాదులు తవ్వుదాం రా అని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. చేతనైతే ఓ విద్యాసంస్థ తీసుకురా అని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్.
Also Read : Rangamarthanda: రాజశేఖర్ కూతురితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!