Singireddy Niranjan Reddy : ప్రజాక్షేత్రంలో ప్రజల మనస్సు గెలవాలి, మన్నన పొందాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పరిస్థితుల్లో రుణ మాఫీ అమలు చేయలేకపోయామని, అయినా వడ్డీతో సహా రుణ మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఉన్నారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తాజాగా ఆయన ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మొన్న మా సోదరుడు పొంగులేటి ఏదేదో మాట్లాడుతున్నరంట.. కరెంటు ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంతకంటే ఘనంగా తెలంగాణలో ఎవరు మంచిగా చేస్తారో, దమ్మున్న వారూ ముందుకు రండి అని ఆయన సవాల్ చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మనస్సు గెలవాలని, మన్నన పొందాలన్నారు. కేవలం ప్రభుత్వాన్ని, ప్రజల పాలకులను తిడితే అధికారం రాదని గ్రహించండని నిరంజన్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో ఏర్పడ్డ లక్ష్యాలు అమలు చేయడం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనడం విడ్డూరంగా ఉందని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
Also Read : Budget 2023: రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్.. రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
రాజకీయాలకోసం మాట్లాడవద్దని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు నిరంజన్ రెడ్డి. బీజేపీ వారికి కేసీఆర్‌నీ తిట్టడం తప్ప మరేది చాత కాదన్నారు నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని ఆయన మండిపడ్డారు. దక్షిణాది ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏంటని ఆయన ప్రశ్నించారు.
Also Read : Tammineni Sitaram: సీఎం ఎక్కడినుండి పాలిస్తే అదే రాజధాని
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!