Bandi Sanjay: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుపట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల రైతుల ఉద్యమ స్ఫూర్తి కి ఆయన అభినందనలు తెలిపారు.
BJP Leader Laxman : సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదని తెలిపారు. గుజరాత్ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని లక్ష్మణ్ సూచించారు.
ఎక్కడ తప్పు మాట్లాడలేదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మియాపూర్ భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా? అని ప్రశ్నించాను అన్నారు.
బండి సంజయ్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఖమ్మం సభను చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
కేసీఆర్ ఏమైనా దేశ నాయకుడా ఆయన పుట్టినరోజు నాడు సెకటేరియట్ ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ జయంతి నాడు సెకటేరియట్ ను ఎందుకు ప్రారంభించరు? కేసీఆర్ ఉన్న ఇబ్బంది ఏంటి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. నిన్న బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణకు ప్రభుత్వం వెలుగుల యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని ప్రజలందరికీ గురువారం నుంచి కంటి పరీక్షలు చేయనున్నారు. తెలంగాణలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా అంధత్వ నివారణకు ఉచిత కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు.