నేడు మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్‌స్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పేరు మాత్రమే మారింది కానీ డీఎన్‌ఏ, పార్టీ గుర్తు మారలేదు అని అన్నారు. 14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారని, రూ.3వేల పింఛను ఇస్తామన్నారు, హోం మంత్రి అమిత్ షాను తీసుకొచ్చి నిధుల వరద పారిస్తామని ఆరోజు ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ 14 నెలల్లో హుజూరాబాద్‌లో ఏం అభివృద్ధి జరిగిందని, 2004లో టీఆర్‌ఎస్ టికెట్ కోసం 33 మంది పోటీపడితే ఈటలకు టికెట్ ఇచ్చారని, ఈటలకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్ అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టు.. తండ్రి లాంటి కేసీఆర్‌ను పట్టుకుని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటల మాట్లాడుతున్నారు.. ఇది తగునా? అని ఆయన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Also Read : Amigos: ఆహా.. రొమాన్స్ లో బాబాయ్ ను మించిపోయిన అబ్బాయ్
ఎట్టి పనికైనా.. మట్టి పనికైనా మనోడే ఉండాలే అంటరు.. మన పార్టీకే ఈ గడ్డపై ప్రేమ ఉంటుందని, గుజరాత్ గులాముల పార్టీ బీజేపీ కాదన్నారు. అంతేకాకుండా.. విస్తార్‌ల మీటింగట అంటూ బీజేపీ మీటింగ్‌లపై వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మారింది తప్ప మా డీఎన్ఏ మారలేదని. జెండా, గుర్తు మారలేదని, నాయకుడు మారలేదన్నారు. దేశంలో కేసీఆర్ నాయకత్వం అవసరముందని ఆయన అన్నారు. చంపుకుంటరో సాదుకుంటరో అనే సెంటి మెంట్ డైలాగులకు పడి పోయి మరోసారి హుజురాబాద్ ప్రజలు తప్పు చేయవద్దన్నారు. హుజురాబాద్‌కు ఇంకా చేయాల్సి ఉందని, చేస్తామని హామీ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొందాలంటూ… పరోక్షంగా హుజురాబాద్ టికెట్ పై హామీ ఇచ్చారు కేటీఆర్.
Also Read : Undavalli Arun Kumar: రాజధానిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. స్పందించనంటూనే..!