Etela Rajender challenges KTR and Harish Rao: దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చ కు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ముందు పెట్టే బడ్జెట్ లు ఓట్ల కోసం ఉంటాయన్నారు. మోడీ 9 ఏళ్లలో ఎప్పుడు అలాంటి బడ్జెట్ పెట్టలేదని తెలిపారు. చాలామంది ఆశించినట్లు మభ్య పెట్టే, మోసం చేసే విధంగా, ఓట్లను దండుకు నేల లేదని ఆరోపించారు. ప్రాక్టికల్ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టారని, ద్రవ్యలోటు ను తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని అన్నారు. క్యాపిటల్ expenditure 13 లక్షల కోట్లు పెట్టడం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. మౌలిక వసతుల కల్పన కోసం 10 లక్షల కోట్లు పెట్టడం మామూలు విషయం కాదని అన్నారు.
Read also: BRS MPs: అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం
మోడీ వంద లక్షల కోట్లు అప్పు చేశారని కేటీఆర్, హరీష్ రావు తప్పుడు మాటలు చెబుతున్నారని, దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చ కు రావాలని సవాల్ విసిరారు. తను విదేశాల్లో, ఇంగ్లీష్ లో చదువుకోక పోవచ్చని, తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టు ఇప్పుడు చెపితే ప్రజలను నమ్ముతారని పగటి కలలు కంటున్నారని అన్నారు. రాష్ట్రం వచ్చే నాటికి gsdp లో అప్పు 15 శాతం ఉంటే… 2020 21 వరకు దాదాపు 30 శాతం చేరిందని ఆరోపించారు. 2014 లో GDP లో 50.1 శాతం అప్పు ఉంటే… 20..21 లో 48 శాతం అప్పు మాత్రమే ఉందని అన్నారు. NCDC, rec, నాబార్డు, PFC ల నుండి రుణాలు తీసుకున్నారు కదా ఆ సంస్థలు ఎక్కడివి అని ప్రశ్నించారు. 5 లక్షల కోట్లు పై గా అప్పు చేసింది ఈ ప్రభుత్వం అంటూ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో ఒక వ్యక్తి సగటు అప్పు లక్ష 25 వేల రూపాయలని అన్నారు. దేశంలో అందరి కంటే అధ్వానంగా పాలిస్తుంది కెసిఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
Moldy Brownies: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. నలుగురికి మెమోలు జారీ చేసిన ఈఓ..