KCR Nanded Tour: ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. నేడు నాందేడ్ కు సీఎం కేసీఆర్ బయలు దేరనున్నారు. అక్కడ భారీ భహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేసీఆర్ సమక్షంలో మరాఠా నాయకులు బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. అయితే నాందేడ్ సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ నాందేడ్ రానున్న నేపథ్యంలో సభా ప్రాంగణం అంతా ముస్తాబైంది. కేసీఆర్ ప్రసంగంతో నాందేడ్ దద్దరిల్లనుంది. కేసీఆర్ రాకకోసం నాందేడ్ గులాబీ మాయం అయింది. మరాఠీ భాషలో భారీగా బ్యానర్లు, హోర్డింగ్ లు దర్శనమిస్తున్నాయి. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్‌లో సభా వేదిక అందంగా ముస్తాబైంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, నలు దిశలా, ఎయిర్‌పోర్ట్ నుంచి సభా వేదిక వరకు దారిపోడవునా గులాబీ తోరణాలు, కేసీఆర్ చిత్రపటాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సభా వేదికతోపాటు, పార్కింగ్, మీడియా గ్యాలరీలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దాదాపు 25 వేల మందికిపైగా కూర్చునేందుకు వీలుగా టెంట్‌ను వేశారు.
Read also: Chinese spy balloon: కలకలం సృష్టించిన బెలూన్ను కూల్చేసిన అమెరికా
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్..
* హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
* అక్కడి నుంచి ప్రత్యేక కాన్వయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
* అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
*అక్కడి నుంచి 1.30 గంటలకు సభాస్థలానికి చేరుకుని, సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతల చేరికలు.
* అనంతరం బీఆర్‌ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రసంగం.
* 2.30గంటలకు సభా స్థలి నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు.
* భోజనానంతరం 4గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
* 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు
Read also: Sunday Stothra parayanam live: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
రాష్ట్రం వెలుపల సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నాందేడ్ జిల్లాలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు బీఆర్‌ఎస్‌లో చేరగా, ఈరోజు పెద్ద ఎత్తున చేరికలుండబోతున్నాయి. బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీ ఎంపీలు సహా సరిహద్దు గ్రామాలకు చెందిన 40 మందికి పైగా గ్రామ సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు.
నాందేడ్‌కు చెందిన నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ బీబీపాటిల్‌తోపాటు పలువురు నేతలు కూడా నాందేడ్‌కు వస్తున్నారు.
MaghaPournami Live: మాఘపౌర్ణమినాడు ఈ స్తోత్రాలు వింటే..