Ponguleti Srinivas Reddy: ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఫైర్ అవుతూనే.. మరోవైపు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను నమ్ముకున్న వారి మనస్సులో ఏ పార్టీ ఉందో .. వారి అభీష్టానికి మేరకే పార్టీ మారుతాను. ఎవరో ఉరికిస్తే తొందరపడి ఏ పార్టీలో చేరను అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయని, గిరిజనుల సమస్యలు తీరుతాయని భావించారు.. కానీ, అవేమి నెరవేరలేదు.. యావత్తు తెలంగాణ సమాజ పోరాటమే స్వరాష్ట్ర సాధన.. టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు , ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పేపర్ లో ఫ్రంట్ పేజి ప్రకటనల ద్వారా మోసం చేసిందని విమర్శించారు. బంగారు తెలంగాణలో గిరిజనుల, గిరిజనేతర సమస్యలు తీరలేదన్న ఆయన.. ప్రతి పక్షంలో ఉండి అభివృధ్దికి తోడ్పాటునివ్వడం కోసం టీఆర్ఎస్ లో చేరానని గుర్తుచేసుకున్నారు.. సమస్యలు తీర్చకుండా చాటలో తవుడు పోసి, కుక్కలు ఉసి కొలిపినట్లు టీఆర్ఎస్ కులాల మధ్య కుంపటి పెట్టిందని.. రెండవ సారి అధికారంలో వచ్చే ముందు ఇచ్చిన హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది ఆరోపించారు.
Read Also: Allu Aravind: కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా?
ఇక, ప్రతి గ్రామ పంచాయతీలో బిల్లులు పెండింగులో ఉన్నాయని మండిపడ్డారు పొంగులేటి.. అనేక మంది పేద సర్పంచ్‌లు భార్యల మెడలో పుస్తెలు అమ్ముకుంటు దీనావస్థలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన వర్క్‌లు దొడ్డి దారిలో ఇచ్చి ఉంటే 2 లక్షల కోట్ల వర్క్‌లు కూడా దొడ్డి దారినే ఇచ్చారా ..? అని ప్రశ్నించారు. చర్చ పెడదామంటే నేను రెడీ కాంట్రాక్టు ఇచ్చి ఎవరు ఎంత పొందారో వివరించి చెబుతా అంటూ సవాల్ చేశారు. వైరా నియోజకవర్గంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారి స్థాయి సస్పెండ్ చేసే స్థాయి కాదన్న ఆయన.. శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేదని చెప్పే వాళ్లు మొన్నటి వరకు ఫ్లెక్సీలపై ఫొటోలు ఎలా పెట్టుకున్నారు..? నాతో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నప్పుడు నా సభ్యత్వం గుర్తుకురాలేదా..? అంటూ ఘాటుగా స్పందించారు. ఆత్మీయ సమావేశాలకు హాజరైన వారిని సస్పెండ్ చేయడం కాదు.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అంటూ సవాల్ చేశారు.
Read Also: Apps Banned: భారత్‌లో 232 లోన్, బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం..కారణమిదే!
స్వర్గీయ నందమూరి తారక రామారావు రూపాయికే కిలో బియ్యం ఇచ్చారు. ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమే గుర్తొస్తారన్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కలలు కంటున్న పార్టీ నాయకులకు తెలియజేసేది ఒక్కటే.. ప్రజల అభిప్రాయం, ప్రజల తేదీ రోజునే ఏ పార్టీలో అయినా చేరతానని ప్రకటించారు.. కొంత అధికారులను హెచ్చరిస్తున్నా.. ఆత్మ పరిశీలన చేసుకోండి. స్థానిక అధికార పార్టీ నాయకుల మాటలు విని నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి.. మీరు ఇబ్బంది పడకండి.. అధికారం ఎవడబ్బసొత్తు కాదు.. అధికారం మారిన రోజు వడ్డీ, చక్ర వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక, రాబోయే ఎన్నికల్లో అశ్వారావుపేట అభ్యర్థిగా జారె. ఆదినారాయణ బరిలో ఉంటారని ప్రకటించారు పొంగులేటి.. ఏ పార్టీలోకి వెళ్లిన ఆ పార్టీని శ్రీనివాస్ రెడ్డి శాసిస్తాడని.. నేను ప్రకటించిన అభ్యర్ధులే పోటీలు ఉంటారని స్పష్టం చేశారు ఉంటారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..