‘అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌పై బీజేపీ అసంతృప్తిలో ఉంది. బీజేపీ తమిళిసైని మార్చొచ్చు. నాకు కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర తెలుసు.’ అంటూ మీడియాతో చిట్‌చాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరికి బానిస కాదు.. ఎవరికి లాలూచీ పడనన్నారు. పేదలకు సాయం అవుతుంది అంటే.. ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులు అయినా చూడనని ఆయన వెల్లడించారు. నేను అసెంబ్లీలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని, రాజకీయంగా బీఆర్‌ఎస్‌ని తిట్టి అహో.. అనిపించుకోవాలి అనే దానికంటే.. ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చూశానని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ని తిడితే పది మంది సంతోష పడతారు కానీ.. సమస్యలు చెప్తే.. పరిష్కారం అయినా అవుతుందన్నారు. సదాశివపేట వరకు మెట్రో కావాలని డిమాండ్ లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. కేసీఆర్ కిట్ తో మహిళకు బెనిఫిట్ అవుతుందన్నారు. అది ఒప్పుకోవాల్సిందేనని, క్యాన్సర్ , హార్ట్ ఆపరేషన్ లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని సూచన చేశానన్నారు జగ్గారెడ్డి. కల్యాణ లక్ష్మీ మంచి పథకమేనని, మంచిని మంచి అనాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు.
Also Read : Tamilnadu Crime: పిలిచినా భార్య రాలేదని.. భర్త కిరాతక పని.. నడిరోడ్డుపైనే..
వీఆర్‌ఏ, ఐకేపీల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, యాదగిరిగుట్ట పునర్నిర్మాణం మంచి నిర్ణయమన్నారు. అక్కడికి కూడా మెట్రో వేయాలని, అనాథ పిల్లకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తా అన్నారు… కేసీఆర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛన్ లు ఇంట్లో ఇద్దరికి ఇవ్వాలన్నారు. దీంతోపాటు.. అసెంబ్లీలో గవర్నర్ తీరుపై బీజేపీ అసంతృప్తి తో ఉన్నట్టు ఉందని, గవర్నర్‌ను మార్చొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కానీ బీజేపీ తెలంగాణలో ఎన్ని గేమ్ లు ఆడినా… రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. నాకు కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర ఎక్కువ తెలుసునని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జాతీయ భావాలతో నడిచారని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ని ప్రధాని చేసిన చరిత్ర రాహుల్, సోనియా గాంధీలది ఆయన అన్నారు. బీజేపీ లెక్క… ఆదానీ.. అంబానీలను పెంచలేదని, అన్ని గ్రామాల్లో అందరూ బాగుండాలని ఉపాధి హామీ తెచ్చింది కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు.
Also Read : Virat Kohli: ఆస్ట్రేలియా జట్టుకి కోహ్లీ చుక్కలు చూపించడం ఖాయం