సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ దశాబ్ద కాలం అయిన పూర్తి చేయలేదని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటున్నారని, అసలు కాలువలు నిర్మించకుండా రైతుల పొలాలకు సాగు నీరు ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు.
BRS: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేశారు. ఇటీవల నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్ ఇతర తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ సమావేశాలకు, సభలకు ఎక్కువ మంది తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో…
హజురాబాద్లో రాజీకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. అయితే.. తాజాగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
జాతీయ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చే పరిస్థితి క్రమశిక్షణ తెలిసిన బీజేపీలో ఎవరికైనా ఎట్లా ఉంటది? అని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయ శాంతి. ఇవాళ ఆమె ట్విట్టర్ వేదికగా 'బీజేపీని బలహీనపర్చటానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగమైన ఇలాంటి మీడియా లీకేజీలకు విలువ ఇయ్యనవసరం లేదు.
పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదని అన్నారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
20 కోట్లు పెట్టి మీ ఈటెల రాజేందర్ ను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారని, ఇందతా సీఎం కేసీఆర్ చెబితేనే ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారని ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము తప్పు చేయనప్పుడు మా ప్రతిష్ట ఎందుకు దిగజారుతోంది? అని ఈటల జమున ప్రశ్నించారు.
ఇపుడు మొదలైంది ఆట అంటున్నారు.. రకరకాల వెన్నుపోట్లు చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త అని బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పక్క రాష్ట్రాల్లో కూడా ఆర్టీసి పరిస్థితులు బాగాలేవరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజా రవాణాలో టీఎస్ ఆర్టీసీ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. కరోనా దెబ్బకు బస్సులు డిపోలకే పరిమితమై.. రోజుకి కోటి రూపాయలు కూడా రాలేదని గుర్తు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ ఉదయం 8 గంటలకు పండరీపురం వెళ్లనున్నారు. అక్కడ రుక్మిణి సమేతంగా విఠేశ్వరస్వామిని పూజిస్తారు. ఆ తర్వాత షోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు.