Times Now Navbharat Survey: దేశంలో నరేంద్రమోడీ హవా తగ్గలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘జన్‌గన్‌కామన్’ పేరుతో ఈ సర్వేను నిర్వహించింది. దేశంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం పక్కా అని చెబుతోంది. బీజేపీ కూటమికి 543 సీట్లకు గానూ 285-325 వరకు సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 111-149 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది.
#JanGanKaMann: आज लोकसभा चुनाव हुए तो किसको कितनी सीटें?#BJP+ 285-325
कांग्रेस+ 111-149
TMC 20-22
YSRCP 24-25
BJD 12-14 #BRS 9-11#AAP 4-7
SP 4-8
अन्य 18-38@PadmajaJoshi @ETG_Research #LoksabhaElection pic.twitter.com/6dm0NSaB6V— Times Now Navbharat (@TNNavbharat) July 1, 2023
#JanGanKaMann: आज लोकसभा चुनाव हुए तो #Telangana में किसको कितना वोट शेयर?
पार्टी वोट शेयर#BRS 37.10%
BJP 25.30%#INC 29.20%
अन्य 8.40% @PadmajaJoshi @ETG_Research #BJP #Congress pic.twitter.com/P4pkc6czfk— Times Now Navbharat (@TNNavbharat) July 1, 2023
ఇక ఏపీలో వైఎస్ఆర్సీపీ 25 స్థానాలు ఉంటే 24-25 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 37 శాతం ఓట్లు సాధించి 9-11 ఎంపీ స్థానాలు సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి 29.2 శాతం, బీజేపీకి 25.3 శాతం ఓట్లు వస్తాయని తేలింది. దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించే అవకాశం ఉందని తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ 20-22 స్థానాలు, ఒడిశాలోని బీజేడీ పార్టీ 12-14 ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. దేశంలో కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 50.30 శఆతం ఓట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.
#JanGanKaMann: आज लोकसभा चुनाव हुए तो #AndhraPradesh में किसको कितनी सीटें? #YSRCP 24-25 #TDP 0-1 #JSP 0
BJP 0
अन्य 0@PadmajaJoshi @ETG_Research #BJP #Congress pic.twitter.com/mEYQ87rQM8— Times Now Navbharat (@TNNavbharat) July 1, 2023