సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం నాడు ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించింది. మార్చి 16న ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు నెలల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులపాలయిందని ఆయన మండిపడ్డారు. పాదయాత్ర తర్వాత ప్రజల్లో చైతన్యం పెరిగిందని, కాంగ్రె్‌సలో జోష్ వచ్చిందని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితోనే పాదయాత్ర చేయగలుగుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరన్నది ఇప్పుడు చర్చకాదని, పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు, హైకమాండ్ ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను పుస్తక రూపంలో ముద్రిస్తామని, కాంగ్రెస్ గెలిచాక వాటిని నెరవేరుస్తామన్నారు.
Also Read : Viral Video : దోసను ఇలా కూడా చేస్తారా.. దేవుడా చంపెయ్యండి రా బాబు..
అయితే.. ఇవాళ సాయంత్రానికి శ్రీశ్రీ సెంటర్ కు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంటుంది. రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు వద్దకు భట్టి విక్రమార్క ర్యాలీగా చేరుకుంటారు. అయితే.. రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 100 రోజులకు పైగా పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సన్మానించారు. మరో వైపు మేడారం నుండి పాదయాత్ర నిర్వహించిన రేవంత్ రెడ్డిని కూడ రాహుల్ గాంధీ ఇదే వేదికపై సన్మానించనున్నారు రాహుల్ గాంధీ.
Also Read : Nandigam Suresh: మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి.. పవన్ ఎందుకు అలా ఊగుతున్నారు..?