జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన కూతురు పై హైకోర్టును ఆశ్రయించిన విషయంలో భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాజ్ఞాస్టిక్ సెంటర్లో అప్గ్రేడ్ చేయబడిన 134 వైద్య పరీక్షలను వర్చువల్గా ప్రారంభమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. అమాయకురాలైన నా బంగారు తల్లి.. నా బిడ్డను వాడుకొని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆరోపించారు. కష్టం చేసుకుని జీవిస్తున్న అమాయకురాలైన నా బిడ్డను మూర్ఖులు దౌర్భాగ్యులు రోడ్డు పాలు చేస్తున్నారని.. సమాజానికి మంచిది కాదన్నారు. వారికి అరిష్టం కలుగుతుందని విమర్శించారు.
Read Also: Nandigam Suresh: మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి.. పవన్ ఎందుకు అలా ఊగుతున్నారు..?
నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.., నా బిడ్డను వాడుకొని, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. రాజ్యాంగబద్ధంగా తన బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని చేర్యాల పట్టణంలో తన పేరుమీదున్న 23 గుంటల భూమిని తన తండ్రి కబ్జా చేసి.. తనకు తెలియకుండా తన పేరు మీద రిజిస్టర్ చేయించారంటూ, ఆ భూమిని చేర్యాల ఆసుపత్రికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ స్థలంలో తన బిడ్డ నిర్మాణం చేసుకుంటానని అంది.. కానీ అలాంటి తన బిడ్డను మీస్ గైడ్ చేసి రోడు పై వేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
Read Also: Amit Shah: మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ లా పాస్ అవుతుంది.. అమిత్ షా
అలాంటి వారిని భగవంతుడు క్షమించడని.. ప్రజలు గమనిస్తున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలి కాబట్టి తాను ప్రజాసేవలోనే ఉంటానని.. ప్రజాసేవకు భంగం కలగకుండా ఉండేందుకే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాల్సిందిగా హైకోర్టు కూడా ఆదేశించిందని పేర్కొన్నారు. తన బిడ్డ ప్రజలకు స్థలాన్ని దానం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చదువుకున్న తన బిడ్డను, ప్రజా క్షేత్రంలో తనను ఎదుర్కోలేక దమ్ము లేని దృష్టులు తన బిడ్డను రోడ్డుమీద వేస్తున్నారని ఆరోపించారు. ఇది క్షమించరాని దుర్మార్గపు చర్య అని.. శక్తి ఉంటే ప్రజాసేవ చేసి, ప్రజా మన్ననలు చేరగొనాలని తప్ప ఇలాంటి అడ్డమైన పనులు చేయకూడదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.