రైతులపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఎవరికి రైతులు ఉరెస్తారో చూడు అని ఎద్దేవా చేశారు. వరద ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో దిక్కు లేదని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు..
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు.. ఇలా అసత్య ప్రచారం చేయడం పద్దతి కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అవగాహనా ఉందా.. కేసీఆర్ ను రైతు హంతకుడు అని అనడానికి నోరు ఎలా వచ్చింది.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10:30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలుకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
RS Praveen Kumar: అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లు ఉన్నాయో బయట పెట్టాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లకిడికపూల్ బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ధరణి పోర్టల్, అసైన్డ్ భూముల అన్యక్రాంతంపై ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
Kishan Reddy: మహబూబ్ నగర్ లో జరిగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బయలుదేరారు. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొననున్నారు.
గ్రేటర్ వరంగల్, భూపాలపల్లి మోరంచపల్లిలో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించి పార్టీపరంగా నిత్యావసర సరకులు, దుప్పట్లు పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద జాతీయ విపత్తు నిధులు 914 కోట్ల వరకు ఉన్నాయన్నారు. breaking news, latest news, telugu news,…
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే అని అన్నారు. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.