బీసీలకు బీజేపీ అండగా అంటుందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 1200 మంది బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పడిందని.. కేసీఆర్ కు బీసీలంటే ఎందుకంత చిన్న చూపని మండిపడ్డారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ బీసీలకు ద్రోహిగా మిగులుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసమే లక్ష బిక్షా అని బీసీలకు ప్రకటిస్తున్నారని నర్సయ్య గౌడ్ విమర్శించారు. బీసీల గోస కేసీఆర్ కు కనపడటం లేదా అని ఆయన ప్రశ్నించారు.
Mahesh Babu: హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు
సీఎం కేసీఆర్ ను తెలంగాణ బీసీ ప్రజానీకం క్షమించరని నర్సయ్య గౌడ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల 12 న యావత్ తెలంగాణ వ్యాప్తంగా బీసీల ఆత్మ గౌరవం కోసం నిరసనలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 18 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్ తో బీసీలకు ఏం చేశారో వైట్ పేపర్ విడుదల చేసే దమ్ము ఉందా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడిగి తిట్టించుకుంటుందని ఆయన విమర్శించారు. బలం లేకున్న అవిశ్వాస తీర్మానం ఎందుకని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు.
Hyderabad: జవహర్ నగర్ బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్
కాంగ్రెస్ పార్టీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అని నర్సయ్య గౌడ్ విమర్శించారు. మణిపూర్ ఘటనలో ఇస్ట్ ఇండియా కంపెనీ చలి మంటలు కాచుకుంటున్నాయని ఆరోపించారు. మయన్మార్, చైనాకు ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతు తెలుపుతోందని.. తెలంగాణలో అమ్మాయిలకు రక్షణ లేదు.. కానీ మణిపూర్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మణిపూర్ లో రెండు వర్గాల మధ్య పోరు జరుగుతోందని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్.. ఊరూరికి లిక్కర్, బెల్ట్ షాపులు విచ్చల విడిగా పెట్టి తాగుబోతు వేదవలను తయారు చేస్తున్నారని నర్సయ్య గౌడ్ దుయ్యబట్టారు.