జాతీయ రాజకీయాల్లో గులాబీ బలం పెంచేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలనే రేపు మహారాష్ట్రకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓ సామాజికవర్గం ఆధ్వర్యంలో కేసీఆర్ కు సన్మానం జరుగనుంది. అయితే.. జాతీయంగా బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో పగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు సీఎం కేసీఆర్. అయితే… ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నేతలు భారీగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అయితే నిన్న మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Also Read : CP Ranganath: కల్తీ మందులు రైతులకు అమ్మితే.. పీడీ యాక్ట్ అమలు చేస్తాం..
ఇదిలా ఉంటే.. ఇటీవల మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త, రచయిత, జానపద కవి అన్నా భౌ సాఠే జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా.. రచయిత, జానపద కవి అన్నా భౌ సాఠేకు భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తూ కేంద్రానికి, తెలంగాణకు ప్రతిపాదన పంపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అన్నా భౌ సాఠే జన్మస్థలం, మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని వాటేగావ్‌లో ఆయన 103వ జయంతి సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అన్నా భౌ సాఠే రచనలు కేవలం మహారాష్ట్ర ప్రజల కోసం మాత్రమే కాకుండా దేశప్రజల కోసం అని అన్నారు. అన్నా భౌ యొక్క అన్ని రచనలను అన్ని భారతీయ భాషల్లోనే కాకుండా.. ఆంగ్లంలోకి అనువదించాలని, తద్వారా ప్రతి ఒక్కరూ అతని భావజాలాన్ని తెలుసుకుంటారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
Also Read : MP Gaurav Gogoi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ మౌనవ్రతం వీడాలి