రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని, కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని మండిపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వము బురద జల్లుతోందని, మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలు అవుతుందన్నారు. ఇది నిజాం రాజ్యాంగం కాదు… నేను నా కుటుంబం అంటే కుదరదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజు ఎంతో దూరం లేదని, కుటుంబ పార్టీలది స్వార్థ రాజకీయ… దేశాన్ని దోచుకోవడమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం డీఎన్‌ఏ ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కి దగ్గర సంబంధం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రి గా పని చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబం తో కాపురం చేస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Earthquake: బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం
అంతేకాకుండా.. ‘బీఆర్‌ఎస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ సోనియా గాంధీ ఆఫీస్. కాంగ్రెస్ కు ఓటు వేసిన బీఆర్‌ఎస్‌కి వేసినట్టే… బీఆర్ఎస్ కి వేసిన ఎంఐఎం కి వేసినట్టే. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. ప్రజలకి హామీ ఇచ్చి దగా చేస్తోంది , వెన్నుపోటు పొడుస్తుంది. కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు ఈ కుటుంబ పార్టీ కి లేదు.. కేసీఆర్ ఫ్యామిలీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. ఈ రాష్ట్రం లో కాషాయ జెండా ఎగుర వేస్తాం. ఆగస్ట్ 15 న ప్రతి ఇంటి మీద జాతీయ జండా ఎగురాలి. ప్రతి ఇంటి నుండి మట్టిని స్వీకరించి ఢిల్లీ కర్తవ్య పథ్ లో నిర్మించే స్మారక స్థూపం కోసం పంపిద్దాము. ప్రతి గ్రామం నుండి బీజేపీ లో చేరాలని స్వాగతం పలుకుతున్నాము. టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లను బీజేపీ లో చేరాలని ఆహ్వానిస్తున్నాం.’ అని ఆయన అన్నారు.
Also Read : Nadendla Manohar: పంచాయతీ రాజ్ వ్యవస్థకు పోటీగా వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు