తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే అని అన్నారు. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.
గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోంటున్నాయి.
MP Komatireddy: ఏళ్లు గడుస్తున్నాయే గానీ హామీని నిలబెట్టుకోలేదని సీఎం కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈనెల 29వ తారీఖున ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు.