రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గానికి అభ్యర్ధిగా మళ్లీ నడిపల్లి దివాకర్ రావునే బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఊహించిన విధంగానే కార్యకర్తల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉరకలెత్తే ఉత్సాహంతో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దివాకర్ అభిమానులు పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఇది బీఆర్ ఎస్ పార్టీకి నైతిక విజయమని ఈ సారి అఖండమైన మెజారిటీతో దివాకర్ రావు గెలిపించుకుంటామని కార్యకర్తలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : S.Jaishankar: మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా ఎస్. జైశంకర్ ప్రమాణ స్వీకారం
అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను సీఎం ప్రకటించారు. గోషామహల్, నాంపల్లి, జనగాం, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థులను తర్వాత ప్రకటిస్తానన్నారు. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తాను ప్రస్తుత నియోజకవర్గం గజ్వేల్, కామారెడ్డితో పాటు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.
Also Read : Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
ఇదిలా ఉంటే.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు నడిపల్లి దివాకర్ రావు. 1981లో మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం సాధించిన దివాకర్ రావు 1983–1992 వరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1987లో ఆసిఫాబాద్ డివిజన్‌లోనే అత్యధిక మెజారిటీతో మంచిర్యాల మండల సింగల్ విండో చైర్మన్‌గా గెలుపొందాడు. ఆ తరువాత 1989 నుండి 1999 వరకు పదేండ్లపాటు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1999, 2004లో రెండుసార్లు (11వ, 12వ ఆంధ్రప్రదేశ్ శాసనసభలు) లక్సెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం అరవింద్ రెడ్డిపై 59,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈయన నాలుగు సార్లు మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా గెలిచాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోకిరాల ప్రేమ్ సాగర్ రావుపై 4,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.