నేడు ( శుక్రవారం ) ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ అన్నారు. ఈనెల 6న గాంధీ ఐడియాలోజీ సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల సినిమా చూపిస్తామన్నాడు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్లిద్దరూ లోపాయికరిగా కలిసి పని చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో అక్కడి సమస్యలపై పోరాడాలి అని ఠాక్రే అన్నారు.
Minister KTR: ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఎస్ ఆర్ డీపీ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను పార్టీ అధిష్టానం తొలగించింది.
RTC Bill: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపలేదు. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్కు పంపింది.
KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్ అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.
కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి మండలి నిర్ణయించినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయడం ఎన్నికల స్టంటే అని ఆయన కుండబద్దలు కొట్టారు. పీర్జదిగుడా, బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లలో వివిధ కార్యక్రమలకు మంత్రి మల్లారెడ్డి హాజరు అయ్యాడు. పీర్జదిగుడా పార్టీ కార్యాలయం దగ్గర కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్, కార్పొరేటర్లు పాలభిషేకం చేశారు.