KTR has no Political Maturity Said Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా?,…
High Court refuses to issue interim orders for KCR: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్, హరీష్‌రావు…
Marri Janardhan Reddy Warns Telangana Police: తెలంగాణ పోలీసులపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిస అయ్యారని విమర్శించారు. సీఎం గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా.. ఉదయనే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము అని హెచ్చరించారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే…
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి విషయంలో గొడవలు ఇంటి నుంచి రోడ్డెక్కాయంటున్నారు. సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్కు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఒక ప్రధాన విభాగంగా ఉంది. ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతూ వస్తున్నారు.
MLC Kavitha’s Open Letter to TBJKMS: సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారన్నారు. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే తనపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు అని, తన తండ్రి కేసీఆర్‌కి రాసిన లేఖను…
ఉప రాష్ట్రపతి ఎన్నికలో గులాబీ పార్టీ వ్యూహం ఏంటి...? ఎన్డీయేకు మద్దతిస్తుందా? లేక ఇండియా కూటమికి జై కొడుతుందా? అది ఇది కాదు... మేం న్యూట్రల్ అంటుందా? అలాంటి స్టాండ్ తీసుకుంటే... బరిలో ఉన్న తెలంగాణ బిడ్డకు అన్యాయం చేసినట్టు కాదా? అందుకే ఎటూ తేల్చుకోలేక చర్చించి నిర్ణయం అంటూ ప్రస్తుతానికి సమాధానం దాట వేస్తున్నారా? పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందన్నది నిజమేనా?
ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ వాడుతోందా? బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందా? అధికారంలో ఉన్నప్పుడే అంతంతమాత్రంగా ఉన్న వ్యవహారం ఇప్పుడు మరింత దిగజారిందా? పెద్దోళ్ళు నోళ్ళు విప్పడం లేదు, ఉన్నవాళ్ళ స్థాయి సరిపోక కేడర్ కూడా పక్క చూపులు చూస్తోందా? ఎక్కడ ఉందా పరిస్థితి? ఎందుకలా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ని ఎప్పుడూ నాయకత్వ లోపం వెంటాడుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడు అదే పరిస్థితి. కాకుంటే… చేతిలో పవర్ ఉన్నప్పుడు కవరైన కొన్ని లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.…
KTR: హైదరాబాద్‌లో ఇటీవల శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాపులో గన్‌పాయింట్ దోపిడీ జరగడం, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని.. శాంతిభద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ…