బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంకు అనుమతి తప్పనిసరి అని జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాధారణ సమ్మతి (General Consent)ని రద్దు చేసింది. అంటే.. సీబీఐకి దర్యాప్తు కోసం రాష్ట్రంలో ప్రవేశించేందుకు ప్రతి కేసులో ప్రత్యేక అనుమతి అవసరం. ఈ నిర్ణయం జీవో ఎంఎస్ నెం.51 ద్వారా 30 ఆగస్టు 2022న జారీ చేయబడింది. ఈ జీవో ప్రకారం.. గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులు అన్నీ రద్దు చేయబడ్డాయి. ఈ నిర్ణయం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946 (DSPE Act) సెక్షన్ 6 ప్రకారం తీసుకోబడినది. ఈ జీవోను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయకున్నా.. సీబీఐకి అనుమతిస్తూ కాళేశ్వరం కేసు అప్పగించాల్సి ఉంటుంది.
సీబీఐకి రాష్ట్రంలో విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని కేసును సీబీఐకి సాధారణ సమ్మతి లేదా ప్రత్యేక సమ్మతి ఇచ్చి అప్పగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సాధారణ సమ్మతి ఇచ్చినప్పుడు సీబీఐకి ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి అనుమతి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) గతంలో సాధారణ సమ్మతి ఉపసంహరించుకున్నాయి. తెలంగాణ సీబీఐకి అనుమతిపై బీఆర్ఎస్ ఇచ్చిన జీవో రద్దు చేయాలి. ప్రత్యేక సమ్మతి విషయంలో.. ఒక ప్రత్యేక కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశం ద్వారా సీబీఐకి అప్పగిస్తుంది. దీనికి గజిట్ నోటిఫికేషన్ లేదా అధికారిక ఆదేశం జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అనంతరం సీబీఐ కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేపడుతుంది.
Also Read: Bandi Sanjay: ప్రభుత్వం సత్యానికి తలవంచింది.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్!
రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించాలంటే:
1. కేబినెట్/హోం డిపార్ట్‌మెంట్ ఆమోదం తీసుకోవాలి
2. ప్రత్యేక సమ్మతి ఆర్డర్ ఇవ్వాలి
3. కేంద్రానికి పంపి ఆమోదం పొందాలి
4. ఆ తరువాతే సీబీఐకి అధికారికంగా కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలు పెడుతుంది
1. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం (కేబినెట్ / హోం శాఖ ఆమోదం)
2. ప్రత్యేక సమ్మతి ఆర్డర్ జారీ
3. కేంద్రానికి (DoPT) పంపడం
4. కేంద్ర ప్రభుత్వం అనుమతి
5. సీబీఐ కేసు రిజిస్టర్ చేయడం
6. సీబీఐ దర్యాప్తు ప్రారంభం