కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి బీఆర్‌ఎస్ పార్టీనే పూర్తిగా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచీ సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేశాం అని, కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌కు అండగా ఉండి విచారణను ఆలస్యం చేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిజం ముందు తలవంచి.. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి అంగీకరించిందని పేర్కొన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లపై అసెంబ్లీలో సిట్ విచారణ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నియమించలేదని, అందుకే వెంటనే సీబీఐ విచారణ కోసం లేఖను పంపించాలని తాము డిమాండ్ చేస్తున్నాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజువారీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు.
Also Read: CM Revanth Reddy: లక్ష కోట్ల ఆస్తి ఎలా కేసీఆర్?.. ఆ టెక్నిక్ ఏందో తెలంగాణ యువతకు చెప్పండి!
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు చర్చ జరిగింది. కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐ దర్యాప్తుకు సీఎం జారీ చేశారు. సీఎం తీసుకున్న సంచలన నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మొదటి నుండి తామే సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసామన్నారు. సీఎం నిర్ణయంపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు.