తెలంగాణ ప్రభుత్వంలో ఏదీ దాగే పరిస్థితి లేదా? దాచాలంటే దాగదులే... దాగుడు మూతలు చెల్లవులే అన్నట్టుగా ఉందా వ్యవహారం? అత్యంత కీలకమైనది, టాప్ సీక్రెట్ అనుకున్న రిపోర్ట్ కూడా ప్రతిపక్షం చేతికి అందిందా? లీకు వీరులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా?
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడుతూ, జనహిత యాత్ర లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనని చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 3 నెలలు లేకుంటే.. 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయన్నారు. దమ్ముంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి ఎన్నికలకు రండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్‌కు బై బై చెప్పే…
బీఆర్ఎస్ బై పోల్ మూడ్‌లోకి వచ్చేసిందా? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిందా? ఎప్పుడు సైరన్ మోగినా మేము సై అంటూ సిద్ధమైపోతోందా? అసలిప్పుడు ఎందుకు హడావిడి చేస్తోంది కారు పార్టీ? ఏ ఉప ఎన్నికల కోసం సిద్ధమవుతోంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ చైర్మన్లు పాల్గొన్నారు
టెక్నికల్‌గా తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్‌లపై గద్వాల ఎమ్మెల్యే స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ ఇంకా.. ఇంకా… ఇరుక్కుపోతోందా? పార్టీ డబుల్ స్టాండ్ తీసుకుంటోందన్న సంగతి ఆన్ రికార్డ్ తేలిపోతోందా? పైకి రాజకీయంగా ఒక మాట, లోపల కోర్ట్‌లో మరో మాట చెబుతోందా? మేడిగడ్డ పిల్లర్స్ కుంగుబాటు విషయంలో బీఆర్ఎస్ ఇన్నాళ్ళు బయట వాదించిందంతా ఉత్తుత్తిదేనా? అసలు విషయాన్ని కోర్ట్‌కు చెప్పేసినట్టేనా? ఇంతకీ కోర్ట్‌కు ఏం చెప్పింది గులాబీ పార్టీ? ఈ లోపల, బయట గేమ్ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో కాళేశ్వరం ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్…
ఓటమి తర్వాత రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్… ఫస్ట్ టైం… డబుల్ డోస్ పొలిటికల్ ప్లానింగ్ చేస్తోందా? జంబ్లింగ్ సిస్టంతో కొత్త ప్రయోగం చేయాలనుకుంటోందా? ఒక నాయకుడి చేరికతో రెండు నియోజకవర్గాల్లో బలపడాలని భావిస్తోందా? అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఇంతకీ ఏంటా పొలిటికల్ ప్లాన్? దానితో ఏయే నియోజకవర్గాల్లో పుంజుకోవాలనుకుంటోంది? ఓటమి తర్వాత వరుస దెబ్బలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది బీఆర్ఎస్. వలసలు ఆ పార్టీని ఇంకా దెబ్బతీస్తున్నాయి. అందునా ఇటీవల మాజీ…
KTR Slams Congress Govt over Urea Shortage: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ముందుచూపు, పాలన అంటే ఏంటో జనాలకు ఇప్పుడు అర్థమైందని.. రైతును అరిగోస పెడుతున్న వారి పతనం ప్రారంభమైందన్నారు. నాడు కేసీఆర్ యూరియా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించారన్నారు. వ్యవసాయ అధికారుల…
బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లను చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. మెకానికల్ లైఫ్ కాదు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మానవ సంబంధాలే ఉండాలని తాము చూస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్…