హుజూరాబాద్.. పొలిటికల్‌గా తెలంగాణ మొత్తం మీద ప్రత్యేక గుర్తింపు ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఒకటి. సీనియర్ లీడర్ ఈటల రాజేందర్‌కి నిన్న మొన్నటి దాకా కంచుకోట ఇది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో... గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండింట్లో పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయారాయన.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ. నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ. ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు. వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్... తన పదవికి రాజీనామా చేస్తారా..? అలా చేయాలనుకోవడం వెనక ఆయన స్కెచ్ ఏంటన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన దానం.. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే... రాజీనామా చేయడమే బెటర్ అనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. తాజాగా... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెర మీదకు రావడంతో.. నాగేందర్ మనసు అటువైపు మళ్ళినట్టు చెప్పుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ... చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది.
Telangana : తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల సామగ్రిని రెడీ చేసుకోవాలని చెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల సంఖ్యను నిర్ణయించింది. జడ్పీపీలు – 31, జడ్పీటీసీలు – 566, ఎంపీపీలు…
KTR : రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మేడిగడ్డ బరాజ్ కూలిందంటున్నారు.. దమ్ముంటే అదే మేడిగడ్డ మీద కూర్చుని చర్చపెడుదాం వస్తావా అంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి పదే పదే మేడిగడ్డ కూలిందంటున్నాడు.…
Harish Rao Meets KCR: హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా సమావేశమయ్యారు.
అక్కడ రాజకీయ నాయకులు అంతా తెలిసే… కావాలని కెలుకుతున్నారా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో అటవీ శాఖ బకరా అవుతోందా? ఆ పార్టీ… ఈ పార్టీ… అని లేదు, ఏ పార్టీ అయినా సరే… అదే తీరా? అధికారుల్ని జనంలో తిట్టేసి తాము హీరోలైపోదామని రాజకీయ నేతలు అనుకుంటున్నారా? పాత వ్యవహారాలకు కొత్త హంగులు అద్దుతున్న ఆ నాయకులు ఎవరు? ఏంటా ఫారెస్ట్ పాలిటిక్స్?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల… పార్టీ ఏదైనా సరే… రాజకీయ నేత ఎవరైనా సరే……
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన…
Talasani Srinivas Yadav slams Congress over BC Reservation: రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నడిపించింది బడుగు బలహీన వర్గాలే అని గుర్తుచేశారు. బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు?, ఇది సాధ్యం కాదంటే 125 ఏళ్ల అనుభవం మాకు ఉందని అన్నారని ఎద్దేవా చేశారు. బీసీ డెడికేషన్ కమీషన్ పేరుతో గోల్…