తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. మొదటి రోజు తమ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ సంతాప తీర్మానంపై చర్చకు సైతం దూరంగా ఉంటున్న కేసీఆర్.. కేటీఆర్ నాయకత్వంలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సభలో అనుసరించాల్సిన వ్యూహ్యంపై కేటీఆర్, హరీష్ కు దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. నిన్న కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘ మంతనాలు..
Also Read:Hyderabad Crime: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ లో భర్తను హత్య చేసిన భార్య.. కారణం మాత్రం అది కాదు
15రోజుల పాటు సభను జరపాలంటోన్న బీఆర్ఎస్.. యూరియా కొరత, వరదలు, పారిశుధ్యం తదితర ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించనున్న బీఆర్ఎస్.. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ తరుపున సభలో మాట్లాడనున్న హరీష్ రావు.. కాళేశ్వరంపై సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలంటోన్న బీఆర్ఎస్.. మొదటి రోజు సభ వాయిదా తరువాత బీఆర్ఎల్పీ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.