Telangana Results: పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన ఓటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Results: తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించింది. 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో 65 స్థానాలను గెలుచుకోబోతోంది. 2018లో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యేలు, లీడర్లు, క్యాడర్ వెళ్లినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లి ఓటమి:
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ఇదిలా ఉంటే గతంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు ఈ సారి తెలంగాణ ఓటర్లు షాక్ ఇచ్చారు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర్ రావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్ రావు, పినపాకలో రేగా కాంతారావు, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, కొల్లాపూర్‌లో హర్షవర్థన్, తాండూర్‌లో రోహిత్ రెడ్డి, ఇల్లందులో హరిప్రియ ఓటమి చెందారు. వీరంతా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారి గెలుపోటములు..
కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు గెలుపు
కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి.. గెలుపు
గద్వాల- సరితా తిరుపతయ్య.. ఓటమి
నకిరేకల్ – వేముల వీరేశం..గెలుపు
తుంగతుర్తి- మందుల సామేలు..గెలుపు
ఖమ్మం: తుమ్మల నాగేశ్వర రావు..గెలుపు
పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..గెలుపు
పినపాక – పాయం వెంకటేశ్వర్లు..గెలుపు
ఇల్లందు- కోరం కనకయ్య…గెలుపు
జగిత్యాల- బోగా శ్రావణి..ఓటమి
ఖానాపూర్ – శ్యామ్ నాయక్.. ఓటమి.
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!