కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ కొనసాగుతున్నారు.
Brothers Victory: అక్కడ వివేక్ బ్రదర్స్, ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ నేతల భారీ విజయం..
కాగా.. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో అందరి దృష్టి ఈ సీటుపై ఉంది. ఇక్కడి నుంచి ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారనే వాదన మొదటి నుంచి ఉంది. అందుకు తగినట్లుగానే కేసీఆర్ దాదాపు ఏ దశలోనూ ఇక్కడ ముందంజలో కనిపించలేదు. మొదటి పదమూడు రౌండ్లు రేవంత్ లీడ్‌లో నిలిచారు. కానీ పద్నాలుగో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 2,100 ఓట్ల ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ ఉన్నారు.