MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కవిత పీఆర్‌వోను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా ఆమెపై వ్యతిరేక వాతావరణం పెరుగుతోందని ఇదే సంకేతమని భావిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికల్లోనూ కవితకు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లను ఫాలో అవుతున్న పలువురు నేతలు, కీలక కార్యకర్తలు అన్‌ఫాలో చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్‌ఎస్ భవిష్యత్తుపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.
Arjun Chakravarthy: సినిమాకి పాజిటివ్ టాక్.. మోకాళ్లపై నిలబడి థాంక్స్ చెప్పిన నిర్మాత