BRS : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద వారు కాదనే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి చాటారని వారు పేర్కొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, గత మూడు నెలలుగా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో అసహనానికి దారితీశాయని అన్నారు. “ఈరోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ముఖ్యంగా మహిళలు కూడా ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కోసం కవితను సస్పెండ్ చేశారు. పేగుబంధం కంటే పార్టీ ముఖ్యమని కేసీఆర్ చూపించారు” అని పేర్కొన్నారు.
Uttar Pradeash: రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్ …
అలాగే కవితపై మరింతగా స్పందిస్తూ, “ఆమె వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతా అవకాశాలు రాకపోవచ్చు కానీ కేసీఆర్ కవితకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కానీ ఆమె ఆ గుర్తింపును నిలబెట్టుకోలేకపోయింది. పార్టీ కంటే నేను ముఖ్యమనే విధంగా మాట్లాడడం వల్ల కార్యకర్తలు కూడా విసిగిపోయారు” అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. “కవిత ‘పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత’ అని అన్న మాట గుర్తు పెట్టుకోవాలి. పార్టీ ఉంటేనే కవితకు ఎంపీ, ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చాయి. నువ్వు కేసీఆర్‌ను నాన్న అని పిలుస్తావేమో కానీ తెలంగాణ ప్రజలు ఆయనను బాపుగా భావిస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసినవారిలో కవిత కూడా ఒకరిగా మిగిలిపోయారు” అని అన్నారు. అలాగే, “కవిత నిన్న మాట్లాడిన మాటలు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా ఆజ్యం పోసినట్లే కవిత ప్రవర్తించింది” అని సునీత మండిపడ్డారు.
వాడెవ్వడు..వీడెవ్వడు..కవితక్కకు అడ్డు ఎవడు? బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆలోచనలో కవిత