MLC Kavitha: పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా యోచనలో…!
- పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత
- కాసేపట్లో ప్రకటించినున్న కవిత
- ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత
- పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్న కవిత, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిపై ఫిర్యాదు చేసే ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని కూడా కవిత భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
PM Modi Funny Moment: దేనికి చప్పట్లు కొడుతున్నారంటూ.. నవ్వులు పూయించిన ప్రధాని..
Also Read
- Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
- Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
- Telangana Govt: ప్రయాణికులకు 'దీపావళి' కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
- Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
ఇక మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురిపైనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. గత కొంతకాలంగా కవిత తన సొంత పార్టీ, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ సభ అనంతరం తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాస్తూ, ఆయన చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కవిత, సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై కూడా ఆరోపణలు చేయడంతో గులాబీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో కవిత.. బీఆర్ఎస్ మధ్య విభేదాలు మరింత బహిరంగమయ్యాయి. పార్టీని వదిలే దిశగా కవిత కదులుతుండగా, అధిష్టానం మాత్రం ముందే క్రమశిక్షణా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
-
E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై మరో వివాదం.. ఏకంగా 31.2 శాతం ఇథనాల్! ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!